పరిటాల సొంత నియోజకవర్గంలో టీడీపీ ఖాళీ.. జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి…!

ys-jagan-and-joinings-ysrcp-latest-telugu-paritala-sunitha-news

పరిటాల సొంత నియోజకవర్గంలో టీడీపీ ఖాళీ.. జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి…!

ఏపీలో అధికార టీడీపీకి ఎదురు దెబ్బలు మొదలయ్యాయి. రాయ‌ల‌సీమ‌లో టీడీపీకి కంచుకోట‌గా ఉన్న అనంత‌పురం జిల్లాలో అందులోనూ మంత్రి ప‌రిటాల సునీత నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లువురు కీల‌క నేత‌లు జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. అనంతపురంజిల్లా రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిటాల సునిత త‌న సామాజిక వ‌ర్గానికి సంబంధించిన వారికే ప్రాధాన్య‌త ఇస్తున్నారంటూ టీడీపీలో విభేదాలు ఏర్పడ్డాయి. ఈ నేపధ్యంలో టీడీపీనేతలైన మాజీ ఎంపీపీ బిల్లే రాజేంద్ర, వైస్ ఎంపీపీ పున్నం వెంక‌ట్రామిరెడ్డి, ఎంపీటీసీ స‌భ్యురాలు బిల్లే గంగ‌మ్మలతో పాటు వారి సహచరులు వైసీపీలో చేరారు. ప‌రిటాల సునీత బంధువులు, అనుచ‌రుల వేధింపులు భరించ‌లేకే తాము వైసీపీలో చేరుతున్న‌ట్లు వారు ప్ర‌క‌టించారు. టీడీపీకి, ప‌రిటాల కుటుంబానికి కంచుకోట అయిన రాప్తాడులో అధికార టీడీపీకి ఝ‌ల‌క్ ఇవ్వ‌డంతో ఈ ప్రభావం జిల్లావ్యాప్తంగా పడింది. రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన నేత‌లు అనేక‌మంది వారి సామాజిక వ‌ర్గానికి చెందిన కొందరికే ప్రాధాన్య‌త ఇస్తూ పెత్త‌నం చ‌లాయిస్తుండడంతో సహనం నశించి ఇలా ప్రతిపక్ష పార్టీలో చేరుతున్నారు. అయితే ఇప్పటికే పరిటాల నియోజకవర్గంలో కష్టపడి పార్టీకోసం పనిచేసినవారనికి ప్రాధాన్యత ఇవ్వలేదంటూ మరికొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీడీపీనేతలైన మాజీ ఎంపీపీ బిల్లే రాజేంద్ర, వైస్ ఎంపీపీ పున్నం వెంక‌ట్రామిరెడ్డి, ఎంపీటీసీ స‌భ్యురాలు బిల్లే గంగ‌మ్మల సహచరులతో పాటు ఇంకొందలు వైసీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇది ఎంత వరకూ సాధ్యం అవుతుందో మనము వెచ్చి చూడాలి మరి….